: లంగర్ హౌజ్, హుమాయున్ నగర్ లలో కార్డాన్ అండ్ సెర్చి... 82 మంది విదేశీయుల అరెస్ట్


హైదరాబాదులోని మెహిదీపట్నం పరిధిలోని లంగర్ హౌజ్, హుమాయున్ నగర్ లను నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. పెద్ద సంఖ్యలో విదేశీయులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నారన్న విశ్వసనీయ సమాచారంతో వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు దాదాపు 300 మంది పోలీసులతో ఆ రెండు ప్రాంతాలను రౌండప్ చేశారు. ఇంటింటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సోదాల్లో వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉంటున్న 82 మంది విదేశీయులు పోలీసులకు చిక్కారు. మరో 16 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కూడా పట్టుబడ్డారు. వీరితో పాటు ఇద్దరు పాత నేరస్తులు కూడా చిక్కారు. ఇక సరైప పత్రాలు లేని 15 బైకులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News