: భారత్-బంగ్లా సరిహద్దుల్లో ఫెన్సింగ్ తో పాటు ఫ్లడ్ లైట్లు: రాజ్ నాథ్ సింగ్


భారత్-బంగ్లా సరిహద్దుల్లో ఫెన్సింగ్ ను త్వరలో పూర్తి చేస్తామని, ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కోల్ కతాలో ఈరోజు ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రాజ్ నాథ్ మాట్లాడుతూ, బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి చొరబడుతున్న వారి సంఖ్య, మత్తు పదార్థాల రవాణా ఎక్కువగా ఉందని అన్నారు. వాటిని నివారించేందుకు గాను భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ ఏర్పాటును త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. అక్రమచొరబాట్లు, డ్రగ్స్ రవాణా వంటి వాటిని నివారించేందుకు బంగ్లా సర్కార్ సహకరిస్తుందని అన్నారు. భారత్ దౌత్య విధానం బాగుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. బంగ్లా నుంచి ఇక్కడికి వలస వచ్చిన మైనార్టీలకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని రాజ్ నాథ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News