: ఇప్పటికీ ధోనీయే అత్యుత్తమ క్రికెటర్: మైక్ హస్సీ
టీమిండియాకు ఇప్పటికీ ధోనీయే అత్యుత్తమ కెప్టెన్ అని ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ మైక్ హస్సీ తెలిపాడు. కాన్ బెర్రా వేదికగా జరిగిన నాలుగో వన్డేలో విజయం ముంగిట నిలిచిన భారత జట్టు ధోనీ వైఫల్యం కారణంగా పరాజయం పాలైందని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సందర్భంగా ధోనీకి మైక్ హస్సీ బాసటగా నిలిచాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ధోనీ అత్యుత్తమ క్రికెటర్ అని పేర్కొన్నాడు. ధోనీని చూసి అరంగేట్రం చేసిన ఆటగాళ్లు మ్యాచ్ ను ఎలా ముగించాలో నేర్చుకోవాలని సూచించాడు. ప్రతి క్రికెటర్ కెరీర్ లో ఇలాంటి క్షణాలను అనుభవిస్తాడని హస్సీ వెల్లడించాడు.