: ట్విట్టర్లో నాని, లావణ్య త్రిపాఠి ముచ్చట్లు!


ప్రముఖ నటుడు నాని, లావణ్య త్రిపాఠి కబుర్లు చెప్పుకున్నారు. ఈ మధ్య ఈ జంట నటించిన 'భలేభలే మగాడివోయ్' సినిమా సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. తాజాగా నాని కొత్త సినిమా 'కృష్ణ గాడి వీర ప్రేమగాథ' ఆడియో విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. దీనిని చూసిన లావణ్య త్రిపాఠి ట్విట్టర్లో నానికి శుభాకాంక్షలు చెప్పింది. 'ట్రైలర్ చాలా బాగుంద'ని మెచ్చుకుంది. 'ట్రైలర్ చూస్తుంటే మరోహిట్టు నీ ఖాతాలో పడినట్టే'నని చెప్పింది. దీనికి స్పందించిన నాని 'ప్రస్తుతానికి నువ్వే హిట్టు మెషీన్' వని అన్నాడు. తాజాగా ఆమె నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన' హిట్ టాక్ తో దూసుకుపోతోందని, అందుకు 'శుభాకాంక్ష'లని చెప్పాడు. తన సినిమాలో 'ఓ అతిథి పాత్ర పోషించరాదూ...సినిమా హిట్టవుతుంది' అని అన్నాడు. దానికి లావణ్య 'తప్పకుండా' అని సమాధానం చెప్పింది. వారి కబుర్లు సోషల్ మీడియాలో వారి అభిమానులను అలరిస్తున్నాయి.

  • Loading...

More Telugu News