: పోలీసులను చూసి రిక్షాలో సూట్ కేస్ వదిలి పరుగందుకున్నాడు!
దేశరాజధాని ఢిల్లీలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా బాంబు పేలుళ్లు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ముమ్మర తనిఖీలు జరుగుతున్నాయి. మయూర్ విహార్ ప్రాంతంలో పోలీసులు విధుల్లో ఉన్నారు. ఇంతలో ఓ రిక్షాలో పెద్ద సూట్ కేసుతో ఓ వ్యక్తి వచ్చాడు. పోలీసులను చూసిన ఆ వ్యక్తి రిక్షాలోని సూట్ కేసును వదిలి పరుగు ప్రారంభించాడు. దీంతో, సూట్ కేసులో బాంబులు ఉన్నాయేమోనన్న అనుమానంతో రిక్షాను పోలీసులు చుట్టుముట్టారు. అతని సంగతి వదిలి సూట్ కేసును జాగ్రత్తగా తెరిచి షాక్ కు గురయ్యారు. అందులో బాంబుల్లేవు కానీ ఓ మహిళ మృతదేహం బయటపడింది. దీంతో ఆ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించి, రిక్షా యజమానిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.