: వారిపై సస్పెన్షన్ ఎత్తేశారు... ఇక నా కుమారుడి తప్పేంటో చెప్పండి: రోహిత్ తల్లి డిమాండ్


హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో సస్పెన్షన్ కు గురైన ఐదురురిలో నలుగురిపై సస్పెన్షన్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఐదో విద్యార్థి, ఆత్మహత్య చేసుకున్న రోహిత్ తల్లి విలపించారు. మిగిలిన వారిపై సస్పెన్షన్ ఎత్తి వేశారంటే, వారేం తప్పు చేయలేదని అర్థమవుతోందని, ఇక తన కుమారుడు చేసిన తప్పేంటని ఆమె ప్రశ్నించారు. వైస్ చాన్స్ లర్ అప్పారావు తమ ప్రశ్నకు సమాధానం చెప్పాలని, ఆయన ఏ తప్పూ చేయకుంటే తమ ఇంటికి రహస్యంగా రావాలని ఎందుకు యత్నించాడో బహిరంగంగా వివరణ ఇవ్వాలని రోహిత్ తల్లి రాధిక ప్రశ్నించారు. తమ జీవితంలో మిగిలిన లక్ష్యం రోహిత్ ఆశయాల సాధనేనని వెల్లడించిన ఆమె, ఏ తప్పూ చేయకుండానే చేతికందివచ్చిన కొడుకును తాము కోల్పోవాల్సి వచ్చిందని వాపోయారు.

  • Loading...

More Telugu News