: ఈ-సిగరెట్ పేలడంతో పళ్లు ఊడిపోయాయి!


ఈ- సిగరెట్ కాలుస్తుండగా ఒక్కసారిగా అది పేలడంతో ఒక వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. అతని పళ్లు ఊడిపోగా, చేతికి, నోటికి, ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన లండన్ లోని టెల్ ఫోర్డ్ అనే గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన స్నేహితుడి నుంచి ఈ- సిగరెట్ ను తెచ్చుకున్నాడు. ఒక్క పఫ్ తీసుకున్న వెంటనే అది పేలడంతో పడకగదికి కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సంబంధిత అధికారులు బాధితుడిని ప్రిన్సెస్ రాయల్ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ- సిగరెట్లు వేడి ఎక్కువై పేలిపోతుంటాయని అధికారులు తెలిపారు. అయితే, ఈ తరహా సంఘటన జరగడం లండన్ లో ఇదే ప్రథమం అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News