: గ్రేటర్ లో వంద స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచి తీరుతుంది: మహేందర్ రెడ్డి
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమని తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఇతర పార్టీల్లోలా టీఆర్ఎస్ పార్టీలో తిరుగుబాటు అభ్యర్థులెవరూ లేరని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో గల 50 డివిజన్లలో 40 డివిజన్లను టీఆర్ఎస్ పార్టీ చేజిక్కించుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో గల గ్రేటర్ డివిజన్లలో 100 స్థానాలను టీఆర్ఎస్ పార్టీ సునాయాసంగా గెలుచుకుంటుందని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ ఆశావహులంతా నామినేషన్లు ఉపసంహరించుకున్నారని ఆయన వెల్లడించారు.