: గ్రేటర్ లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు... బరిలో 1,939 మంది
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు ఈసీ ఇచ్చిన గడువు మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఉపసంహరణ గడువు ముగిసేసరికి 150 డివిజన్లలో 1939 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. పార్టీల అగ్రనేతల బుజ్జగింపులతో చివరిరోజు 604 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ సాయంత్రంకల్లా అభ్యర్థుల తుది జాబితాను ఈసీ ప్రకటించనుంది. మరోవైపు అన్ని పార్టీలకు రెబల్స్ బెడద తప్పలేదు. పలువురు తమకు బీఫారంలు ఇవ్వలేదని ఆందోళన చేస్తున్నారు. అయితే బీజేపీ-టీడీపీలు రెండూ కూడా స్నేహపూర్వకంగా ఏడు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. హబ్సిగూడ, ఉప్పల్, పటాన్ చెరు, ఐఎస్ సదన్, జూబ్లీహిల్స్, చర్లపల్లి, అమీర్ పేట్ లో రెండు పార్టీల అభ్యర్థులు పోటీ చేయనున్నారు.