: బీజేపీకి షాక్... ప్రేమ్ సింగ్ రాథోడ్ రాజీనామా
గ్రేటర్ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీకి పెద్ద షాక్ తగిలింది. జంటనగరాల్లో ఆ పార్టీ ప్రధాన నేతల్లో ఒకరిగా పేరున్న గోషామహల్ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. తన అనుయాయులకు టికెట్లను ఇప్పించుకోవడంలో విఫలమైనందునే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కనబెట్టి కొత్తగా వచ్చిన వారికి టికెట్లను ఇచ్చారని ఆయన ఆరోపించారు. కాగా, రాజీనామా నిర్ణయం వద్దని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వారించినా రాథోడ్ వినలేదని తెలుస్తోంది. రాథోడ్ రాజీనామా విషయమై మరింత సమాచారం తెలియాల్సివుంది.