: మాజీ ఎంపీ, నేతాజీ అన్న కుమారుడు సుబ్రతా బోస్ కన్నుమూత
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్న కుమారుడు, మాజీ ఎంపీ సుబ్రతా బోస్ కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. దక్షిణ కోల్ కతాలోని తన నివాసంలో ఆయన గతరాత్రి గుండెపోటుతో చనిపోయినట్టు సన్నిహితులు వెల్లడించారు. కొంతకాలం నుంచి సుబ్రతాబోస్ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ ఎంపీగా బోస్ 2004 నుంచి 2009 వరకు పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.