: ఆ ఫొటోలో ఉన్నది మోదీ కాదు.. మార్ఫింగ్ చేసుండొచ్చు: ఆర్టీఐ అధికారులు


నరేంద్ర మోదీ యువకుడిగా ఉన్నప్పుడు చీపురు పట్టి ఊడుస్తున్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటో ప్రజలను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిన విషయమే. తాజా సమాచారమేమిటంటే, ఆ ఫొటోలో ఉన్నది మోదీ కాదని, అందులో ఉన్నది తాను అంటూ అహ్మదాబాద్ కు చెందిన ఒక వ్యక్తి ఆర్టీఐను ఆశ్రయించాడు. మోదీ ఫేస్ తో ఒరిజినల్ ఫొటోను మార్ఫింగ్ చేసి ఉండవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా అసలు ఫొటోను, మార్ఫింగ్ ఫోటోను అధికారులు పరిశీలించి చూశారు. కాగా, 2014 లోక్ సభ సాధారణ ఎన్నికల ప్రచార సమయంలో చీపురు పట్టుకుని ఉన్న మోదీ ఫొటోను బీజేపీ నేతలు విరివిగా ఉపయోగించారు. బతుకుతెరువు కోసం నాడు మోదీ టీ అమ్మడమే కాకుండా చీపురు కూడా పట్టారంటూ ఎన్నికల ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News