: హెచ్సీయూలో కేజ్రీ... విద్యార్థుల ఆందోళనలకు సంఘీభావం


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైదరాబాదులో అడుగుపెట్టారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లారు. రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో వర్సిటీలోనే కాక దేశంలోని పలు ప్రాంతాల్లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లో నిరసనల హోరు తగ్గినా, సెంట్రల్ వర్సిటీలో మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్సిటీకి వచ్చిన కేజ్రీవాల్ విద్యార్థుల ఆందోళనలకు సంఘీభావం ప్రకటించారు. రోహిత్ స్నేహితులతో మాట్లాడారు. మరికాసేపట్లో ఆయన అక్కడి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

  • Loading...

More Telugu News