: రాజధాని మాస్టర్ ప్లాన్ పై అవగాహన సదస్సును అడ్డుకున్న తుళ్లూరు రైతులు
గత కొన్ని రోజుల నుంచి రాజధాని మాస్టర్ ప్లాన్ పై రాజధాని ప్రాంతంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు గుంటూరు జిల్లా తుళ్లూరులో జరుగుతున్న అవగాహన సదస్సును రైతులు అడ్డుకున్నారు. సీఆర్ డీఏ కమిషనర్ వచ్చి తమ సందేహాలను నివృత్తి చేయాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ వచ్చేవరకు సమావేశాన్ని ఆపాలని రైతులు స్పష్టం చేశారు. దాంతో అధికారులు సదస్సును నిర్వహించే అవకాశం లేకుండాపోయింది. కాగా నేటితో రాజధాని మాస్టర్ ప్లాన్ పై అవగాహన సదస్సులు ముగుస్తున్నాయి.