: మౌనం వీడకపోతే మోదీ ముద్దాయి... సీపీఐ నారాయణ
హెచ్సీయు విద్యార్థి రోహిత్ ఆత్మహత్య విషయంలో ప్రధాని మోదీ ఇంకా మౌనం వీడకుంటే ఆయనని ముద్దాయిగా పరిగణించాల్సి వస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. రోహిత్ ఆత్మహత్యపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వివరణ ఇచ్చారుగానీ, బాధ్యులపై తీసుకునే చర్యల గురించి చెప్పలేదన్నారు. ఇకనైనా ప్రధాని మోదీ ఈ అంశంలో మౌనం వీడాలని, లేకుంటే ఆయనని ముద్దాయిగా పరిగణించాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని అన్నారు.