: హెచ్ సీయూలో విద్యార్థులతో గొంతు కలిపిన దళిత ప్రొఫెసర్లు... అడ్మినిస్ట్రేటివ్ పదవులకు రాజీనామా


హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యతో వర్సిటీ ప్రాంగణం ఆందోళనతో హోరెత్తుతోంది. నిన్నటిదాకా విద్యార్థి సంఘాలు మాత్రమే ఆందోళనలకు దిగగా, తాజాగా వారికి వర్సిటీలో పనిచేస్తున్న దళిత ప్రొఫెసర్లు కూడా తోడయ్యారు. రోహిత్ ఆత్మహత్యపై నిన్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రొఫెసర్లు తాము నిర్వహిస్తున్న అడ్మినిస్ట్రేటివ్ పదవులకు రాజీనామా చేశారు. అంతేకాక విద్యార్థులు చేస్తున్న ఆందోళనల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకోవాలని కూడా వారు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో నేటి నుంచి ఆందోళనలు మరింత ముదరనున్నాయన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News