: నాని గురించి మాట్లాడాలంటే నా గురించి నేను చెప్పుకున్నట్టే: అల్లరి నరేశ్
నాని గురించి మాట్లాడాలంటే తన గురించి తాను మాట్లాడుకున్నట్టే ఉంటుందని ప్రముఖ నటుడు అల్లరి నరేశ్ అన్నాడు. 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా అల్లరి నరేశ్ మాట్లాడుతూ, నానిని పొగడడం తనకు ఇబ్బందిగా ఉంటుందని అన్నాడు. అయినా తప్పడం లేదని చెప్పిన నరేశ్, వైవిధ్యమైన, విభిన్నమైన కథలు ఎంచుకోవడంలో నాని స్టైలే వేరని చెప్పాడు. 'భలేభలే మగాడివోయ్' సినిమా తరువాత ఇలాంటి కథలో నటించాలంటే చాలా ధైర్యం ఉండాలని అన్నాడు. నానికి అది మెండుగా ఉందని చెప్పిన నరేశ్, అందుకే నాని సినిమాలకు విశేషమైన ఆదరణ లభిస్తుందని తెలిపాడు. ఈ సినిమా సూపర్ హిట్టేనని నరేశ్ జోస్యం చెప్పాడు.