: కాబూల్ లోని రష్యా దౌత్య కార్యాలయం వద్ద బాంబు పేలుడు!


కాబూల్ లోని రష్యా దౌత్య కార్యాలయం ఎదుట సూసైడ్ కారు బాంబర్ ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ సంఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, 24 మంది గాయపడినట్లు ఆఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ డిప్యూటీ మంత్రి మహమ్మద్ అయూద్ సలాంగీ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ సంఘటనపై రష్యా దౌత్య కార్యాలయం అధికార ప్రతినిధి అలెక్సీ కొసార్వ్ మాట్లాడుతూ, దరూల్ అమన్ రోడ్డులోని దౌత్య కార్యాలయం వద్ద పేలుడు శబ్దం వినిపించిందని చెప్పారు. కారు బాంబు పేలిందని, దౌత్య కార్యాలయ సిబ్బంది ఎవ్వరూ ఈ సంఘటనలో గాయపడలేదని అన్నారు. భారీగా మంటలు వ్యాపించడంతో సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారన్నారు.

  • Loading...

More Telugu News