: రోహిత్ కుటుంబానికి టీడీపీ 5 లక్షల ఆర్థికసాయం


ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ సెంట్రల్ యూనివర్శిటీ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ కుటుంబానికి టీడీపీ ఆర్థికసాయం చేయనున్నట్లు ప్రకటించింది. ఉప్పల్ లో నివాసముంటున్న రోహిత్ కుటుంబాన్ని ఏపీ మంత్రులు రావెల కిషోర్ బాబు, పీతల సుజాత, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు, టీ టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు పరామర్శించారు. అతని ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక సాయం కింద రూ.5 లక్షలు అందజేస్తామని రోహిత్ కుటుంబసభ్యులకు తెలిపారు. అనంతరం మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ, ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ వీసీ అప్పారావు ఇప్పటికే రాజీనామా చేసి ఉండాల్సిందని అన్నారు. వర్శిటీల్లో విద్యార్థుల మధ్య సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత వీసీలపైనే ఉంటుందన్నారు.

  • Loading...

More Telugu News