: ‘ఆస్కార్’ అందుకోనున్న భారతసంతతి నటుడు రాహుల్ థక్కర్


భారత సంతతి నటుడు, నిర్మాత రాహుల్ థక్కర్ కు టెక్నికల్ ఎచీవ్ మెంట్ పురస్కారాన్ని అందజేయ నున్నట్లు ఆస్కార్ అవార్డ్స్ కమిటీ పేర్కొంది. ఈ విషయాన్ని ‘ఆస్కార్’ అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించింది. ‘గ్రౌండ్ బ్రేకింగ్ డిజైన్’లో రాహుల్ థక్కర్, రిచర్డ్ చాంగ్ లకు సంయుక్తంగా ఈ పురస్కారం అందజేయనున్నట్లు ఆ వెబ్ సైట్ లో పేర్కొంది. కాగా, ఫిబ్రవరి 28న ఆస్కార్ అవార్డులను ప్రదానం చేస్తారు. దీనికంటే ముందుగా ఫిబ్రవరి 13న పది సైంటిఫిక్, టెక్నికల్ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రదానం చేస్తుంది.

  • Loading...

More Telugu News