: హైదరాబాదు పోలీసుల అదుపులో 138 మంది విదేశీయులు


హైదరాబాదులోని పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు మొత్తం 138 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీస్ స్టేషన్ కు తరలించి, వారి వద్ద నిబంధనల మేరకు పత్రాలు ఉన్నాయా? లేదా? అనే విషయాలను పరిశీలిస్తున్నారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశంలోని పలు నగరాల్లో ఉగ్రవాదులు మెరుపు దాడులు చేయనున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన హైదరాబాదు పోలీసులు, ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. విదేశాలకు చెందిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారన్న పక్కా సమాచారంతో బహుదూర్ పురా, కంచన్ బాగ్, అసద్ బాబానగర్ లను వందల సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు వివిధ దేశాలకు చెందిన 138 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News