: సల్మాన్ కేసు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 'హిట్ అండ్ రన్' కేసును బాంబే హైకోర్టు కొట్టివేయడంపై మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజుల్లో సుప్రీంకోర్టుకు వెళుతోంది. ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వారం రోజుల్లో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్ పీ)ని దాఖలు చేయాలని ఆ రాష్ట్ర న్యాయశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ శాఖ న్యాయవాది ఒకరు తెలిపారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారని కూడా తెలిపారు.