: బచాఖాన్ వర్సిటీ ఉగ్రదాడిపై మమతాబెనర్జీ సంతాపం
వాయవ్య పాకిస్థాన్ లోని బచాఖాన్ యూనివర్సిటీలో జరిగిన ఉగ్రదాడిపై పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ స్పందించారు. దాడి ఘటన బాధాకరమని, ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు దీదీ ట్విట్టర్ లో సంతాపం తెలిపారు. కాగా ఈ దాడిలో కొంతమంది విద్యార్థులు, సాధారణ పౌరులు చనిపోగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి సమయంలో వర్సిటీలో 3వేల మంది విద్యార్థులు, 600 మంది అతిథులు ఉన్నారు. మరోవైపు వర్సిటీపై దాడికి పాల్పడింది తామేనని తెహ్రీక్-ఇ-తాలిబన్ సంస్థ ప్రకటించింది.