: రోహిత్ ఆత్మహత్యకు బాధ్యత నాది కాదు...రాజీమానా ప్రసక్తే లేదు: తేల్చిచెప్పిన అప్పారావు
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు బాధ్యత తనది కాదని వర్సిటీ వీసీ ఆచార్య అప్పారావు తేల్చిచెప్పారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ వీసీ తన పదవికి రాజీనామా చేయాలని వస్తున్న డిమాండ్లను ఆయన తోసిపుచ్చారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన రోహిత్ సహా ఐదుగురు విద్యార్థులను నిబంధనల మేరకే సస్పెండ్ చేశామని కూడా ప్రకటించారు. విద్యార్థుల డిమాండ్లకు తలొగ్గి రాజీనామా చేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. వర్సిటీలో ప్రశాంత వాతావరణం ఉంటే, విద్యార్థులతో మాట్లాడేందుకు సిద్ధంగానే ఉన్నానని చెప్పారు. రోహిత్ కుటుంబంతో కూడా మాట్లాడతానని ఆయన తెలిపారు.