: బీహార్ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని మహాకూటమి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీకి ఆ రాష్ట్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. ఈ మేరకు సీఎం నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై చర్చించి పైవిధంగా నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కార్యాలయ అధికారులు వెల్లడించారు. రిజర్వుడ్, అన్ రిజర్వుడ్ కేటగిరీలు సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.