: పాకిస్థాన్ లోని బచా ఖాన్ వర్సిటీలో ఉగ్ర దాడి... విద్యార్థులు, అధ్యాపకులపై కాల్పులు!


పాకిస్థాన్ లోని బచాఖాన్ యూనివర్సిటీపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. వాయవ్య ప్రాంతంలోని ఖైబర్ పంఖ్తువా ప్రావిన్స్ లో ఉన్న ఈ వర్సిటీ క్యాంపస్ లోకి ముగ్గురు సాయుధులైన ఉగ్రవాదులు చొరబడి తరగతి గదులు, హాస్టళ్లలోని విద్యార్థులు, అధ్యాపకులపై విచక్షణారహితంగా కాల్పులుకు పాల్పడుతున్నట్టు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. ఈ కాల్పుల్లో ఐదుగురికి గాయాలయ్యాయని తెలిసింది. వెంటనే సైనిక బలగాలు రంగంలోకి దిగాయి. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు, వర్సిటీ సిబ్బంది కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News