: బెజవాడ సబ్ రిజిస్ట్రార్ అక్రమాస్తులు రూ.30 కోట్లు... అరెస్ట్ చేసిన ఏసీబీ


విజయవాడలో సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న పీవీ దుర్గాప్రసాద్ కు జీతం మీద కంటే ‘గీతం’ మీదే మక్కువ ఎక్కువ. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా అక్రమార్జనకు తెర తీశాడు. ఏకంగా రూ.30 కోట్ల మేర అక్రమాస్తులను కూడబెట్టాడు. కృష్ణా జిల్లా గుణదల సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న సమయంలోనే అక్రమ సంపాదనకు తెర తీసిన దుర్గాప్రసాద్ అప్పటి నుంచి పోగేస్తునే ఉన్నాడట. తాజాగా ఆయన పాపం పండింది. విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు నిన్న దుర్గా ప్రసాద్ ఇల్లు, ఆయన బంధవుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. నిన్న రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగిన సోదాల్లో ఆయన అక్రమార్జనను రూ.30 కోట్లుగా ఏసీబీ తేల్చింది. దీంతో నేటి ఉదయం ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News