: 2015 'వరస్ట్ పాస్ వర్డ్'లివే!
పాస్ వర్డ్... ఓ మెయిల్ ఓపెన్ చేయాలన్నా, ఆన్ లైన్లో ఓ ఎకౌంట్ తెరవాలన్నా, డబ్బులు బట్వాడా చేయాలన్నా ఎంతో కీలకం. దైనందిన జీవితంలో అతి ముఖ్యమైన పదంగా మారిపోయిన 'పాస్ వర్డ్'ను ఎంచుకోవడంలో ఎంతో మంది ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని 2015లో ప్రజలు ఎంచుకున్న పాస్ వర్డ్ లు నిరూపిస్తున్నాయి. స్ప్లాష్ డేటా కథనం ప్రకారం గత 12 నెలల్లో అత్యధికులు ఎంచుకున్న పాస్ వర్డ్ లు ఏంటో తెలుసా?... '123456', 'పాస్ వర్డ్'. ఈ సంవత్సరం ఈ రెండు పదాలతో పాటు 'ఫుట్ బాల్' అన్న పదమూ అత్యధికుల పాస్ వర్డ్ గా మారింది. ఈ తరహాలో ఇతరులు సులువుగా తస్కరించగలిగే పాస్ వర్డ్ లు వద్దని ఎప్పటిప్పుడు చెబుతున్నా నెటిజన్లు వినట్లేదని గూగుల్, యాపిల్ తదితర సంస్థలు చెబుతున్నాయి.