: ఢిల్లీ, కుంభమేళాపై దాడులకు ‘ఉగ్ర’ కుట్ర... నిఘా వర్గాల హెచ్చరికలతో భగ్నం చేసిన పోలీసులు


నిఘా వర్గాలు ఏమాత్రం ఆలస్యం చేసినా... దేశ రాజధాని ఢిల్లీ, హరిద్వార్ లో జరుగుతున్న అర్ధ కుంభమేళాలపై ఉగ్రవాదులు విరుచుకుపడేవారే. ఢిల్లీలోని ఓ షాపింగ్ మాల్, హరిద్వార్ కుంభమేళా ఉత్సవాలపై అప్పటికే రెక్కీ పూర్తి చేసిన ఉగ్రవాదులు ఇక దాడులు చేస్తారనగా... జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కనుసన్నల్లో జరుగుతున్న ఆపరేషన్ దాదాపుగా విజయవంతమైంది. దాడులను నిష్ఫలం చేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో, ఢిల్లీ పోలీసులు ఉగ్రవాదులను పట్టేశారు. దాడులకు కుట్ర చేసిన ఉగ్రవాద ముఠాలోని ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సదరు ముఠాకు చెందిన మరికొంత మంది కోసం ముమ్మర గాలింపు చేపడుతున్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ వేడుకలకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. సదరు భద్రతా చర్యలపై సమీక్ష సందర్భంగా ఈ విషయం వెల్లడైంది. ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్న ఈ ఆపరేషన్ మొత్తం అజిత్ దోవల్ కనుసన్నల్లోనే జరుగుతోందట.

  • Loading...

More Telugu News