: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యలింగ నాయకర్ కన్నుమూత
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యలింగ నాయకర్ (80) నిన్న రాత్రి కన్నుమూశారు. మూడు పర్యాయాలు ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన మత్స్యకార వర్గానికి చెందన నేతగా చిరపరచితులు. చివరిసారిగా 1994లో సంపర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ కు చైర్మన్ గానూ వ్యవహరించారు. సత్యలింగ నాయకర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని కోసంగిలోని తన స్వగృహంలోనే ఆయన తుది శ్వాస వదిలినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు(గురువారం) ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు.