: నింగిలోకి 'ఐఆర్ఎన్ఎస్ఎస్ 1ఈ'ని తీసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ 31
ఈ ఉదయం సరిగ్గా 9:31 నిమిషాలకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్‌ఎల్వీ సీ31 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా దాదాపు ఒకటిన్నర కిలోల బరువున్న ‘ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ’ షార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ దగ్గరుండి ప్రయోగాన్ని పర్యవేక్షిస్తున్నారు. పీఎస్‌ఎల్వీ సిరీస్ లో ఈ రాకెట్ లాంచ్ 33వది కాగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాల శ్రేణిలో ఇది ఐదవదని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ప్రయోగం రెండు దశలు దిగ్విజయంగా పూర్తి కాగా, ఇప్పుడే హీట్ షీల్డ్ విజయవంతంగా విడిపోయి, మూడో దశలోకి ప్రవేశించింది. మరో 10 నిమిషాల్లో ఉపగ్రహం కక్ష్యలోకి చేరనుంది.