: తెలుగు రాష్ట్రాలకు చలి దూరం, నేడు వర్షాలు!


గత నెల రోజులుగా ఆవరించివున్న చలిపులి నెమ్మదిగా పంజా ముడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల వరకూ పెరిగాయి. ఈ ద్రోణి కర్ణాటక వరకూ విస్తరించి వుందని, దీని ప్రభావంతో నేడు, రేపు పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవచ్చని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా, నిన్న హైదరాబాద్ తో పాటు కర్నూలు, రామగుండం తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. గత రాత్రి హైదరాబాద్ లోని మాదాపూర్, కూకట్ పల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలూ పెరుగుతున్నాయి. గత రాత్రి నుంచి కడప జిల్లా పెద్దముడిగం, జమ్మలమడుగు మండలాల్లో ఆగకుండా వర్షం కురుస్తుండటంతో జొన్న, వేరుశనగ పంటలు నీటిలో మునిగినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News