: ఇకపై ఆన్‌లైన్‌లో ట్రైన్ టిక్కెట్ తీసుకోవడం కష్టమే!
ట్రైన్ టిక్కెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌లో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు రైల్వే మంత్రిత్వశాఖ నడుంబిగించిది. ఇకమీదట ఎవరైనా సరే ఒక బుకింగ్ చేసిన 35 సెకెన్ల తరువాతే రెండవ బుకింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధానానికి సంబంధించి త్వరలో రైల్వేశాఖ తమ వెబ్‌సైట్‌లో మార్పులు తీసుకురానున్నట్లు తెలుస్తొంది. ఇంతకాలం కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు ముందుగానే ట్రైన్ టిక్కెట్లను బుక్ చేసుకుని సామాన్య ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది.