: తమ్ముణ్ణి సినిమాల్లోంచి రాజకీయాల్లోకి రమ్మంటున్న కాశ్మీర్ కాబోయే సీఎం
పీడీపీ అధినేత్రి మహబూబా ముఫ్తీ తండ్రి మరణానంతరం తన సోదరుడు తనకు అండగా ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. పలు ఆంగ్ల చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ఆమె సోదరుడు తసాదుక్ హుస్సేన్‌ను తాజాగా పీడీపీ నేతలకు పరిచయం చేశారు. దీనితోపాటు లోక్ సభ ఎన్నికల్లో సోదరుని చేత పోటీ చేయించాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతవరకూ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఇందుకు సమ్మతించినట్టు తెలుస్తోంది. కాగా బీజేపీతో ఎటువంటి షరతులు లేకుండానే పొత్తులను కొనసాగిస్తూ, ప్రభుత్వాన్ని కొనసాగించాలని మహబూబా ముఫ్తీ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తొంది.