: సెంట్రల్ యూనివర్శిటీలో బీజేపీ నేతకు చేదు అనుభవం!


సెంట్రల్ యూనివర్శిటీ పీహెచ్ డి విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య సంఘటనతో వర్శిటీ అట్టుడుకుతోంది. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో మాట్లాడేందుకు అక్కడికి వెళ్లిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. అక్కడి విద్యార్థులు ఆయన కారును చుట్టుముట్టారు. ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. కారు అద్దాలను పగులగొట్టడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అతికష్టం మీద ఆయన కారును అక్కడి నుంచి పోలీసులు బయటకు పంపారు.

  • Loading...

More Telugu News