: 'ఇంక్రెడిబుల్ ఇండియా' బ్రాండ్ అంబాసిడర్ గా అమీర్ ను అందుకే తొలగించాం: డీఐపీపీ సెక్రటరీ


ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ను 'ఇంక్రెడిబుల్ ఇండియా' బ్రాండ్ అంబాసిడర్ గా ఎందుకు తొలగించాల్సి వచ్చిందో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) సెక్రటరీ అమితాబ్ కాంత్ వెల్లడించారు. 'ఇంక్రెడిబుల్ ఇండియా' బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న వ్యక్తి భారత కీర్తి ప్రతిష్ఠలు పెంచే వ్యాఖ్యలు చేయాలి కానీ, బ్రాండ్ వేల్యూ దెబ్బతినేలా వ్యవహరించకూడదని ఆయన తేల్చి చెప్పారు. అమీర్ ఖాన్ చేసిన మత అసహనం వ్యాఖ్యల కారణంగా భారత్ బ్రాండ్ వేల్యూ దెబ్బతిందని ఆయన స్పష్టం చేశారు. అందుకనే ఆయనను బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతల నుంచి తొలగించామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News