: ‘నర్తనశాల’లో నటించాలనుకున్నా... కానీ కుదర్లేదు!: బాలకృష్ణ


ఫలానా పాత్రలో నటించాలనే డ్రీమ్ రోల్ ఏదీ తనకు లేదని బాలకృష్ణ అన్నారు. ‘పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాల్లో పలు పాత్రలు పోషించిన ఎన్టీఆర్ లా మీరు కూడా ప్రత్యేకమైన పాత్రల్లో నటించాలనే డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా?’ అనే ప్రశ్నకు బాలయ్య పైవిధంగా సమాధానమిచ్చారు. బాలకృష్ణ, సౌందర్య ఇతర ప్రముఖ తారాగణంతో తెరకెక్కిస్తుండగా అర్థాంతరంగా ఆగిపోయిన 'నర్తనశాల' చిత్రం గురించి ప్రస్తావించగా..తిరిగి అది ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పలేనని ఆయన అన్నారు. ఏ చిత్ర నిర్మాణమైనా సవ్యంగా జరగాలంటే.. అన్నీ కలిసి రావాలని అన్నారు. పౌరాణిక చిత్రాల్లో ‘నర్తనశాల’లో నటించాలనుకున్నాననీ, అది కుదర్లేదని బాలకృష్ణ చెప్పారు.

  • Loading...

More Telugu News