: బీజేపీలోనే ఉన్నా...చురుగ్గా లేను అంతే: రెబల్ స్టార్ కృష్ణంరాజు
తాను బీజేపీలోనే ఉన్నానని ప్రముఖ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు చెప్పారు. హైదరాబాదులో ఓ టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత రాజకీయాల్లో తాను చురుగ్గాలేనని అన్నారు. బీజేపీలోనే ఉన్నానని, బీజేపీలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. కొన్నిసార్లు అన్నీ అనుకున్నట్టు ఉండవని, రాజకీయాల పేరిట ప్రతిసారీ ప్రజల్లోకి వెళ్లడం తనకు కుదరదని ఆయన తెలిపారు. అందుకే తాను రాజకీయాల్లో చురుగ్గా ఉన్నట్టు కనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీకి తానెప్పుడూ దూరం కాలేదని ఆయన చెప్పారు. రాజకీయాలన్నాక ఎవరో ఒకరు ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉంటారని ఆయన తెలిపారు. విమర్శలన్నీ వాస్తవాలు కాదని ఆయన స్పష్టం చేశారు.