: జీహెచ్ఎంసీ పరిధిలో ముగిసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఇవాళ్టితో ముగిసింది. మొత్తంగా 4,039 నామినేషన్లు దాఖలవగా, 3,850 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. మిగిలిన 189 నామినేషన్లను తిరస్కరించారు. పరిశీలన ప్రక్రియ తరువాత టీఆర్ఎస్ నుంచి 839, బీజేపీ 426, టీడీపీ 658, కాంగ్రెస్ 659 నామినేషన్లు మిగిలాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21 వరకు గడువు ఉంది.