: ప్రోస్టేట్ చికిత్స కోసం అమెరికా వెళుతున్న దలైలామా
టిబెట్ ఆధ్యాత్మిక మత గురువు దలైలామా ప్రోస్టేట్ చికిత్స కోసం అమెరికా వెళుతున్నారు. అక్కడి మాన్నెసోటాలోని మాయో క్లినిక్ లో ఈ నెలాఖరుకు చికిత్స చేయించుకోనున్నట్టు దలైలామా కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఈ చికిత్స తరువాత కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకుని మార్చ్ నుంచి ఆయన తన కార్యకలాపాలను యథావిధిగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. సెప్టెంబర్ లోనే వైద్య పరీక్షలు చేయించుకున్న దలైలామాను వైద్యులు కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో అంతకుముందు అనుకున్న యూఎస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా 2008లో ఢిల్లీలో దలైలామా గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయించుకున్నారు.