: మరికొంతమంది కాల్ మనీ నిందితులకు బెయిల్
ఏపీ కాల్ మనీ కేసులో మరికొంతమందికి బెయిల్ లభించింది. యలమంచిలి రాము, భవానీ శంకర్, దూడల రాజేశ్ లకు విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కొన్నిరోజుల కిందట 9 మందికి బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ నేత మల్లాది విష్ణును కస్టడీకి కోరుతూ విజయవాడ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. కాగా ఆయన బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఇంకా తీర్పు వెల్లడించలేదు.