: అది స్టేట్ ఫైట్, ఇది స్ట్రీట్ ఫైట్: కేటీఆర్


ప్రత్యేక తెలంగాణ కోసం చేపట్టిన ఉద్యమానికి, ప్రస్తుత గ్రేటర్ ఎన్నికలకు సంబంధం లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం రాష్ట్ర స్థాయిలో జరిగిన 'స్టేట్ ఫైట్' వంటిదని అభివర్ణించిన ఆయన, జీహెచ్ఎంసీ ఎన్నికలు 'స్ట్రీట్ ఫైట్' అని అన్నారు. ఏ ఫైట్ చేస్తుంటే అందుకు తగ్గట్టుగా ఆ వ్యూహాలతో వెళ్లాల్సి వుంటుందని వివరించారు. ఈ మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం కల్యాణలక్ష్మి పథకం మైనారిటీలు, దళితులకు అండగా ఉందని గుర్తు చేస్తూ, త్వరలోనే దీన్ని బడుగు, బలహీన వర్గాలకూ దగ్గర చేస్తామని అన్నారు. హైదరాబాదీలు అన్ని పార్టీలకూ గ్రేటర్ పీఠాన్ని అందించాయని, ఒక్కసారి టీఆర్ఎస్ కూ అవకాశమిస్తే, అభివృద్ధి ఎలా ఉంటుందన్న విషయాన్ని కళ్లముందుంచుతామని అన్నారు.

  • Loading...

More Telugu News