: పారిస్ రిట్జ్ హోటల్ లో భారీ అగ్నిప్రమాదం
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని రిట్జ్ హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హోటల్ పై అంతస్తులో మంటలు చెలరేగాయని, ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని సిబ్బంది తెలిపారు. ఆ వెంటనే 60 మంది అగ్నిమాపక సిబ్బంది, 15 అగ్నిమాపక యంత్రాలు ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే, పారిస్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ, రిట్జ్ హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని, మోటార్ వాహనాలపై వెళ్లే వారు వెండోమ్ ప్రాంతానికి వెళ్లొద్దని ట్విట్టర్ ద్వారా సూచించారు. ప్రస్తుతం రిట్జ్ హోటల్ ను రెనోవేట్ చేసేందుకు మూసివేయడంతో అతిథులు, వినియోగదారులెవరూ లేరు. అందుకే ప్రమాదం తప్పింది.