: ‘రిలయన్స్’ మహిళా న్యాయవాది డ్రైవింగ్ లైసెన్స్ జీవితకాలం రద్దు!
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లోని లీగల్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న ఒక మహిళా న్యాయవాది డ్రైవింగ్ లైసెన్స్ ను జీవితకాలం రద్దు చేశారు. ఈమేరకు ముంబై ఆర్టీవో ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు.. గత ఏడాది జూన్ 10వ తేదీన మద్యం మత్తులో ఉన్న మహిళా న్యాయవాది జాహ్నవి గడ్కర్ (35) తన ఆడి క్యూ 3 కారును రాంగ్ రూట్ లో నడుపుకుంటూ వెళ్లింది. ఒక ట్యాక్సీని ఢీకొట్టింది. ఆ ట్యాక్సీలో ప్రయాణిస్తున్న మహమ్మద్ సలీం సాబూవాలా (50), మహ్మద్ హుస్సేన్ సయీద్(57) అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో వుంది. కాగా, తాజాగా ముంబై రవాణాశాఖ ఆమె డ్రైవింగు లైసెన్సును జీవితకాలం నిషేధించింది.