: సల్వీందర్ సింగ్ కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించిన ఎన్ఐఏ
పంజాబ్ గుర్ దాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సత్యశోధన (లైడిటెక్టర్) పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీలోని ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ లో సల్వీందర్ సింగ్ కు ఈ పరీక్షలు నిర్వహించారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడికి ముందు సల్వీందర్ కిడ్నాప్, విడిచిపెట్టడం వంటి వాటిపై అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. కాగా, పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి అనంతరం దాడులపై పూర్తి సమాచారం సేకరించిన ఎన్ఐఏ అధికారులు, ఆ సందర్భంగా చేసిన దర్యాప్తు సందర్భంగా ఎస్పీ సల్వీందర్ ఒక్కోసారి ఒక్కోరకమైన సమాధానాలు చెబుతూ అధికారుల్లో పలు అనుమానాలు రేకెత్తించారు. దీంతో ఆయనకు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు.