: రోహిత్ ఆత్మహత్యపై హెచ్ ఆర్సీలో ఫిర్యాదు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ మానవ హక్కుల కమిషన్ లో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ జరిపి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన హెచ్ ఆర్సీ... ఫిబ్రవరి 1లోగా నివేదిక సమర్పించాలని సైబరాబాద్ సీపీ, హెచ్ సీయూ వీసికి ఆదేశాలు జారీ చేసింది.