: రోహిత్ కుటుంబాన్ని విశ్వవిద్యాలయమే ఆదుకోవాలి: హెచ్ సీయూ విద్యార్థులు


ఆత్మహత్యకు పాల్పడ్డ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ కుటుంబాన్ని విశ్వవిద్యాలయమే ఆదుకోవాలని హెచ్ సీయూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థుల ఆందోళనలతో దద్దరిల్లుతోంది. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారందరినీ వెంటనే అరెస్టు చేయాలని, వీసీ అప్పారావును తక్షణమే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. రోహిత్ ను చదివించేందుకు వారి తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని అన్నారు. వారి కుటుంబానికి రోహిత్ ప్రధాన ఆధారమని, అందుకే అతని కుటుంబాన్ని విశ్వవిద్యాలయమే ఆదుకోవాలని, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడమే కాకుండా రూ.50 లక్షల పరిహారం కూడా అందించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. గతంలో దళిత, బహుజన సంఘాలు చేసిన చారిత్రాత్మక పోరాటాల మూలంగానే తాము ఈ విశ్వవిద్యాలయాలకు వచ్చి చదువుకో గల్గుతున్నామని, రిజర్వేషన్ల వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. అయితే, తాము ఇక్కడికి రావడం కొందరికి ఇష్టం లేదని, అందుకే ఇక్కడ తమని వేధింపులకు గురిచేస్తున్నారని, బాధితులుగా మారుస్తున్నారని హెచ్ సీయు విద్యార్థులు వాపోయారు.

  • Loading...

More Telugu News