: మరో పెను సంచలనం... నిష్క్రమించిన స్పెయిన్ బుల్


ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. ఈ ఉదయం వీనస్ విలియమ్స్ ఓడిపోగా, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ సైతం తొలి రౌండ్ లోనే నిష్క్రమించాడు. స్పెయిన్ కే చెందిన వెర్దాస్కో తో పోటీ పడ్డ నాదల్ 6-7 (6-8), 6-4, 6-3, 6-7 (4-7), 2-6 తేడాతో ఓటమి పాలయ్యాడు. తొలి సెట్ ను పోగొట్టుకుని రెండు, మూడు సెట్లను గెలుచుకున్నప్పటికీ, ఆపై వెర్దాస్కో ధాటికి తాళలేక చేతులెత్తేశాడు. దాదాపు 5 గంటల పాటు పోరు సాగగా, వెర్దాస్కో సంధించిన 20 ఏస్ లు ఆయన గెలుపునకు సహకరించాయి. నాదల్ 7 ఏస్ లకు పరిమితమై, కీలక సమయాల్లో 6 డబుల్ ఫాల్ట్ లు చేయడం ఓటమికి దగ్గర చేసింది.

  • Loading...

More Telugu News