: అల్ ఖైదా ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు


కరుడుగట్టిన అల్ ఖైదా ఉగ్రవాది అబ్దుల్ సమీని ప్రత్యేక ఢిల్లీ పోలీసుల బృందం అరెస్ట్ చేసింది. పాక్ లో శిక్షణ పొంది ఇండియాకు వచ్చి, ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు రూపొందిస్తున్న సమీ హర్యానాలోని మేవాత్ జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. అబ్దుల్ స్వగ్రామం జార్ఖండ్ రాష్ట్రంలోని జమ్ షడ్పూర్ నగరం. భారత ఉపఖండంలో అల్ ఖైదా సభ్యుడిగా చాలా కాలంగా తప్పించుకుని తిరుగుతున్నాడు. గత సంవత్సరం ఒడిశాలో అరెస్ట్ అయిన మరో ఉగ్రవాది అబ్దుల్ రెహమాన్ తో ఇతనికి సన్నిహిత సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు. తొలుత దుబాయ్ వెళ్లి, అక్కడి నుంచి పాక్ లోని మన్సేహ్రా ప్రాంతం చేరుకుని ఉగ్ర శిక్షణ తీసుకున్న సమీ, గత సంవత్సరం ఇండియాకు తిరిగి వచ్చాడని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం సమీని విచారిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News