: ప్రపంచ కురువృద్ధుడు కొయిడే కన్నుమూత


ప్రపంచ కురువృద్ధుడు యసుటారో కొయిడే తుదిశ్వాస విడిచారు. జపాన్ కు చెందిన ఆయన వయస్సు 112 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొయిడే, ఇటీవల ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ నగోయా పట్టణంలో చనిపోయారని అక్కడి అధికారులు తెలిపారు. రైట్ సోదరులు విమానాన్ని తయారుచేయడానికి కొన్ని నెలల ముందు ఆయన జన్మించారని, అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు దక్కించుకున్నారని తెలిపారు. దర్జీపని చేసి జీవితం గడిపిన కొయిడే... 1903, మార్చి 13న జన్మించారు.

  • Loading...

More Telugu News